mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబరుకే ‘వారణాసి’ పూర్తి

1 గంట క్రితం

varanasi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా చిత్రీకరణపై రాజమౌళి తాజా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోందని, ప్రధాన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ... ‘‘షూటింగ్‌లో ప్రధాన భాగం పూర్తయింది. భారీ యాక్షన్ సన్నివేశాలన్నీ చిత్రీకరించాం. ప్రస్తుతం కథను అనుసంధానించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అక్టోబర్ తొలి వారంలో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2027 ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్