హైదరాబాద్ : సౌరశక్తి రంగంలో రాణిస్తోన్న ట్రుజోన్ సోలార్ లో బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వి చాముండేశ్వరనాథ్ రూ.2.25 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇప్పటికే పలువురు ప్రముఖ క్రికెటర్లు భాగస్వాములుగా ఉన్న ఈ సంస్థలో తన పెట్టుబడి ద్వారా దేశంలో సౌరశక్తి వినియోగాన్ని మరింత ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ నిధులతో సంస్థ తన విస్తరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేయడానికి వీలుంది. సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ కీలక బ్రాండ్ అయిన ట్రుజోన్ సోలార్‌లో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ప్రముఖ క్రికెటర్లు పెట్టుబడిదారులుగా ఉన్నారు.
Print Editionట్రుజోన్ సోలార్‌లో వి చాముండేశ్వరనాథ్ పెట్టుబడులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)