ఫిఫా ప్రపంచకప్ నార్వే 28 ఏళ్ల తర్వాత తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఐలో భాగంగా ఇరాక్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నార్వే 4-1 తేడాతో విజయం సాధించింది. నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ డబుల్ గోల్స్ (ఆట 29వ, 43వ నిమిషం)తో మెరవగా, లియో గార్డ్ (76వ నిమిషం), ఇరాక్ ఆటగాడు అమెన్ హుస్సెన్ (90+6వ నిమిషం) సెల్ఫ్ గోల్ కొట్టడంతో అది నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక ఇరాక్ తరఫున అమెన్ హుస్సేన్ ఆట 39వ నిమిషంలో గోల్ సాధించాడు. దీంతో నార్వే గ్రూప్-ఐలో తొలి స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి ఫిఫాకు అర్హత సాధించిన నార్వే.. ఇరాక్‌తో మ్యాచ్‌లో ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట మొదలైన కాసేపటికే ఇరాక్ గోల్‌పోస్టులపై దాడులు మొదలుపెట్టిన నార్వేకు 29వ నిమిషంలో ఎర్లింగ్ హాలండ్ తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 43వ నిమిషంలో మరో గోల్ సాధించడంతో నార్వే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండో సగంలో మరో రెండు గోల్స్ రావడం.. అందులో ఒకటి ఇరాక్ ఆటగాడి సెల్ఫ్ గోల్ నార్వే ఖాతాలోకి వెళ్లిపోయింది. నార్వే తన తర్వాతి మ్యాచ్‌లో జూన్ 23న సెనెగల్‌తో, ఫ్రాన్స్‌తో ఇరాక్ తలపడనున్నాయి.
నార్వే 28ఏళ్ల తర్వాత
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)