శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మా చదువులకు ఆటంకం కలిగించొద్దు : పాఠశాల విద్యార్థుల ధర్నా

2 గంటల క్రితం

మా చదువులకు ఆటంకం కలిగించొద్దు : పాఠశాల విద్యార్థుల ధర్నా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కలెక్టరేట్ (ప్రకాశం) : పీవీఆర్ బిసి బాలుర ప్రీ మెట్రిక్ హాస్టల్ లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో ఖాళీగా ఉన్న రూమ్ లు కేటాయించి చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ .... పాఠశాల విద్యార్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ ఎఫ్ఐ వి, పిడిఎస్ యు ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి ఆందోళనకు దిగారు. పాఠశాల సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్టల్ భవనాన్ని యాజమాన్యం ఖాళీ చేయించడంతో తాము చదువుతున్న పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములు హాస్టల్ కు కేటాయించడానికి కలెక్టర్ అంగీకారం తెలిపారన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా సదరు పాఠశాలలో మ్యూజియం ఏర్పాటు చేయాలంటూ ... బిసి హాస్టల్ ను నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ భవనానికి తరలించే ప్రయత్నం సరికాదని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల విద్యార్థులు చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పివిఆర్ స్కూల్ లోనే గదులు కేటాయించి హాస్టల్ కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ ఐ నాయకులు సిహెచ్ వినోద్, వీరస్వామి, పిడిఎస్ యు నాయకులు ఎల్ రాజశేఖర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్