తిరుపతి : లంచం తీసుకుంటున్న జిల్లా డిప్యూటి డైరెక్టర్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన శుక్రవారం తిరుపతి జిల్లాలోని గుడిమల్లంలో జరిగింది. గుడిమల్లం లో సుభహాన్ అనే రైతు తన భార్య పేరు మీద మత్స్య శాఖ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. రూ.50 లక్షలతో ఫిషరీ ప్లాంట్ ను సిద్ధం చేసుకున్నాడు. ప్రధానమంత్రి యోజన పథకం మీద 60 శాతంతో (రూ.30 లక్షలు) రాయితీ తీసుకున్నాడు. ఈ రాయితీ అనుమతి కోసం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న ను రైతు కలిశాడు. జిల్లా ఫిషరీస్ అధికారి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. లక్ష రూపాయలు మొదటి విడతగా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేందుకు సిద్ధపడుతున్న వారిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ ... ఎసిబికి పట్టుబడిన జిల్లా డిప్యూటి డైరెక్టర్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 03:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)