గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయండి : ఎస్ఎఫ్ఐ

2 రోజుల క్రితం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయండి : ఎస్ఎఫ్ఐ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ .... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై కళాశాలలు ఫీజుల భారం మోపకుండా ప్రభుత్వం పెండింగ్ రూ.7000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జిఓ నెంబర్ 77 ను రద్దు చేయాలని , మెస్ చార్జీలు రూ.3000కు ఉంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్