గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వడ్డాది కేజీబీవీ మేడపై నుండి జారిపడిన విద్యార్థిని : పరిస్థితి విషమం

2 రోజుల క్రితం

వడ్డాది కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని మొదటి అంతస్థు మేడపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడింది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బుచ్చయ్యపేట (అనకాపల్లి) : వడ్డాది కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని మొదటి అంతస్థు మేడపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కాకినాడ నాగమణి అనే విద్యార్థిని మంగళవారం ఉదయం మొదటి అంతస్తులో పిట్టగోడ పక్కన సన్ సైడ్లో పడిన బట్టలను బకెట్ పైకి ఎక్కి వంగి తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో ఉన్న నాగమణిని వెంటనే కేజీబీవీ సిబ్బంది 108లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి విశాఖ కేజీహెచ్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాచ్మెన్ అర్జునమ్మ, ఎన్ఎస్ మేడం మంగ, హెల్త్ అసిస్టెంట్ సత్య ఉన్నారు. ఎస్ఓ మేడం అందుబాటులో లేరని స్థానికులు తెలిపారు. కాగా విద్యార్థిని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థినిలు తమ దుస్తులను మొదటి అంతస్తు పిట్టగోడ పైన ఆరబెడుతున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదని పలువురు తెలిపారు. ఎస్సై పీ.మనోజ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేజీబీవీలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని గుర్తించి, తక్షణమే వాటిని పునరుద్ధరించాలని కేజీబీవీ సిబ్బందికి సూచించారు. ఎస్ఎంసి చైర్మన్ ఎడ్ల రామమూర్తి, కూటమి నేతలు దొండా నరేష్, సన్యాసిరావు,గిరిబాబు సిరిగిరి శెట్టి శ్రీరామమూర్తి, సింగంపల్లి రమేష్, తలారి శంకర్, కేజీబీవీని సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్