గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అధ్వాన్నంగా వడ్డాది కేజీబీవీ : పిఏసిఎస్ చైర్మన్ దొండా నరేశ్

2 రోజుల క్రితం

Vaddadi KGBV in deplorable condition: PACS Chairman Donda Naresh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వడ్డాది (అనకాపల్లి) : బుచ్చియ్యపేట మండలం వడ్డాది కేజీబీవీలో పరిస్థితులు ఏమీ బాగా లేవని స్థానిక పిఏసిఎస్ చైర్మన్ దొండా నరేశ్ అన్నారు. విద్యార్థిని కాకినాడ నాగమణి మొదటి అంతస్తు నుండి జారిపడి గాయపడిన సమాచారం తెలిసిన వెంటనే మంగళవారం ఆయన కేజీబీవీని సందర్శించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. కేజీబీవీలో ఆరు నెలలుగా సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదన్నారు. ఎస్ఓ మేడం స్థానికంగా అందుబాటులో ఉండడం లేదన్నారు. మెనూ కూడా సక్రమంగా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు. ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడం వలన విద్యార్థులు బోర్ వాటర్ తాగుతున్నారని దీని వలన తరచూ ఇన్ఫెక్షన్స్, జ్వరాలు బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. చిన్నచిన్న రిపేర్లు కూడా చేయించకపోవడం బాధాకరం అన్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదు అన్నారు. కేజీబీవీ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మెనూ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విద్యార్థుల నుండి ఆరోపణలు వస్తున్నాయన్నారు. కేజీబీవీ ప్రాంగణంలో విద్యార్థినులకు ఆట స్థలం కూడా లేకుండా ప్లాంటేషన్ చేసేసారన్నారు. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కేజీబీవీలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.



సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్