బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమర్‌ ఖలీద్‌, ఇమామ్‌ల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ

58 నిమిషాల క్రితం

Khalid,  Imam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 01:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జెఎన్‌యు మాజీ నేత ఉమర్‌ ఖలీద్‌, సామాజిక కార్యకర్త షార్జిల్‌ ఇమామ్‌ల బెయిల్‌ పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌, జస్టిస్‌ దినేష్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది. ఇది వారి మూడవ బెయిల్‌ పిటిషన్‌. 53 మంది మృతికి, 700 మందికి పైగా గాయపడటానికి కారణమైన 2020 ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న కుట్రలో కీలక సూత్రధారులుగా ఉన్నారన్న ఆరోపణలపై, ఉమర్‌ ఖలీద్, ఇమామ్‌లపై ఉపా చట్టం కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రక్షణ పొందిన సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత లేదా ఆ ఉత్తర్వు వెలువడిన తేదీ నుండి ఏడాది గడిచిన తర్వాత వీటిలో ఏది ముందుగా జరిగితే అప్పుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీరికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు జనవరి 5న జారీ చేసిన ఉత్తర్వును తాము మార్చలేమని కోర్టు పేర్కొంది.

ఈ కుట్ర కేసులో కార్యకర్త ఖలీద్ సైఫీ, మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌లను కూడా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిందితులుగా చేర్చింది. విచారణ కోర్టు జులై 4న నిందితుల బెయిల్ పిటిషన్లను మూడవసారి తిరస్కరించిన తర్వాత ఈ తాజా పిటిషన్లు దాఖలయ్యాయి. షార్జిల్‌ ఇమామ్‌ను 2020 ఆగస్టు 25న, ఉమర్‌ ఖలీద్‌ను 2020 సెప్టెంబర్ 13న అరెస్టు చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్