బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు

1 గంట క్రితం

veeramachineni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 01:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రిలో చేరడంతో కేసు నమోదు

హైదరాబాద్‌: ‘వీఆర్‌కే డైట్‌’, ‘వీరమాచినేని డైట్‌’ పేరుతో ప్రచారం చేస్తున్న వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. టైప్‌-1 డయాబెటిస్‌ను ఆహార నియమాలతో నయం చేస్తామని చెప్పి తన నుంచి రూ.26 వేలు తీసుకున్నారని నిర్మల్‌ జిల్లాకు చెందిన 30 ఏళ్ల న్యాయ విద్యార్థి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న బాధితుడు ఇన్సులిన్‌ తీసుకుంటుండగా, రామకృష్ణను సంప్రదించారు. ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు తీసుకోవద్దని, తాము సూచించిన డైట్‌ను మాత్రమే పాటించాలని వారు సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 12న డైట్‌ ప్రారంభించిన బాధితుడు రెండు రోజులకే తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రిలో చేరాడు. చికిత్సకు రూ.58 వేలకు పైగా ఖర్చయిందని తెలిపాడు. తనకు ఎదురైన అనారోగ్యానికి రామకృష్ణ సూచించిన ఆహార విధానమే కారణమని ఆరోపిస్తూ ఈ నెల 24న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సోషల్‌ మీడియాలో అనధికార వైద్య సలహాలు ఇస్తూ, అల్లోపతి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన మరో కేసు విచారణ కూడా కొనసాగుతోంది. ఈ కేసును సిటీ సివిల్‌ కోర్టు నవంబర్‌ 25కి వాయిదా వేసి, వీరమాచినేనికి సమన్లు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్