- నరసరావుపేట మీదుగా మచిలీపట్నం-కర్నూలుకు కొత్త రైలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య నరసరావుపేట మీదుగా కొత్త రైలు సర్వీసు ప్రారంభానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం నుండి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల డిమాండ్, నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రైలు సర్వీసుకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. కొత్త రైలు అందుబాటులోకి వస్తే మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా నరసరావుపేటతో పాటు మార్గమధ్యలోని ప్రాంతాల ప్రజలకు మెరుగైన రైలు రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త రైలు సర్వీసుకు ఆమోదం తెలిపిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ప్రాంతీయ రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం కీలక ముందడుగు అని ఎంపీ పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)