మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎట్టకేలకు.. నోరువిప్పిన ప్రధాని మోడీ

1 గంట క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నీట్ పేపర్ లీక్‌ ‘ఘోర పాపం’ అంటూ వ్యాఖ్య

న్యూఢిల్లీ : నీట్‌ పేపర్‌ లీక్‌పై ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోడీ ఎట్టకేలకు నోరువిప్పారు. నీట్‌-యుజి పేపర్‌ ‌లీకై 12 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడి మూడు మాసాలు కావస్తుంది. దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం గళమెత్తిన అనంతరం ప్రధాని స్పందించారు. మంగళవారం ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనిపై ప్రధానమంత్రి మోడీ ఒక ప్రకటన చేశారు. నీట్‌ ‌లీకేజి ఘోర పాపం’ అని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అంతేకాదు, ఈ ఉదంతంపై తక్షణమే స్పందించి, మళ్లీ పరీక్షలను కూడా నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయాలని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామని ప్రధాని వెల్లడించారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడటానికి భయపడేలా, బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, సోమవారం దేశరాజధాని ఢిల్లీ నగర వీధుల్లో యువత కదంతొక్కింది. అనంతరం పోలీసుల దాష్టీకంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, సమస్యను పరిష్కరిం చకుండా ఆందోళనపై ఉక్కుపాదం మోపుతుం దని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్