మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమార్షల్‌ లా అమలు చేస్తున్నారా?

1 గంట క్రితం

leftmp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• రాజధాని నడిబొడ్డున విద్యార్థుల తలలు పగలగొట్టారు

• దాడిపై హోంమంత్రి ప్రకటన చేయాల్సిందే

• వామపక్ష ఎంపిల ఆగ్రహం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నడిబొడ్డున పోలీసులు విద్యార్థుల తలలు పగలగొట్టారని లెఫ్ట్‌ ‌పార్టీల ఎంపిలు ఆగ్రహించారు. దేశంలో మార్షల్‌ ‌లా అమలుజేస్తున్నారని విమర్శించారు. మంగళవారం జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేస్తొన్న విద్యార్ధులకు వారు మద్దతు తెలిపారు. పోలీసుల చర్యను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని లెఫ్ట్‌ ‌పార్టీ ఎంపిలు డిమాండ్ చేశారు. గాయపడిన విద్యా ర్థులకు న్యాయం చేయాలని, పరీక్షల్లో అవక తవకలు, ఉన్నత విద్యలో నెలకొన్న వివాదాలపై ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దాడి చేసిన పోస్టర్స్‌ను ప్రదర్శించారు. కాక్రోచ్‌ ‌పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే వారితో చేతులు కలిపి అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష ఎంపిలు దీప్కేకు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించారు.

​ఇంతడి దారుణాన్ని

ఎన్నడూచూడలేదు: జాన్‌ బ్రిటాస్

బిజెపి డంబుల్ ఇంజన్‌ ‌సర్కార్‌ కేంద్ర బలగాలను ఉపయోగించి విద్యార్ధులు చేస్తున్న ‌శాంతియుత ఉద్యమాన్ని అణిచేస్తుందని సిపిఎం జాన్‌‌బ్రిట్టాస్‌ ‌విమర్శించారు. దేశంలో మార్షల్‌ ‌లా అమలవుతుందని, అమాయక యువతపై పోలీసులు క్రూరంగా దాడి చేశారన్నారు. ఇంతడి దారుణాన్ని ఎన్నడూచూడలేదన్నారు.

వారి పోరాటం దేశం కోసమని తెలిపారు. దేశ రాజధాని నడిబొడ్డున విద్యార్ధుల తలలు పగలకొట్టి రక్తం కళ్లజూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి చేసింది పోలీసులు మాత్రమే కాదని, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గూండాలు కూడా ఉన్నారని తెలిపారు. అయితే. ఇంతటి దాడిని సైతం తట్టుకుని అసాధారణంగా పార్లమెంట్‌‌కు చేరుకున్నారని, యువత ఆగ్రహిస్తే ఏ భారీ కేట్లు, ఏ భద్రతా దళాలు ఆపలేవనే సత్యాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకొవాలని హితవు పలికారు. ఈ విషయంపై పార్లమెంట్‌ అట్టుడుకుతుందని, పదే పదే సభను వాయిదా వేస్తున్నారని తెలిపారు. ఎంతోమంది విద్యార్ధుల తలులు పగిలాయని, కాళ్లు విరిగాయని, తీవ్రగాయాలతో రోడ్లపై పడి ఉన్నారని, దీనికి ఎవరు భాద్యత వహిస్తారని మోడీ సర్కార్‌‌ను నిలదీశారు. తక్షణమే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ ‌షా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇద్దరూ రాజీనామా చేయాల్సిందేనని బ్రిట్టాస్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

​అమిత్ షా వివరణ ఇవ్వాలి : సందోష్ కుమార్

​ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసుల దాడి హేయమని, దీనిపై అమిత్ షా పార్లమెంటులో వివరణ ఇవ్వాలని సిపిఐ ఎంపి నేత సందోష్ కుమార్ డిమాండ్‌ ‌చేశారు. ‘‘మేము రెండు డిమాండ్‌ ‌చేస్తున్నాం. అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ఏం జరిగిందో వివరించాలి, ఎందుకంటే విద్యార్థులపై ఇలాంటి దురాగతాలను భారత్ ఎన్నడూ చూడలేదు. 300 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. దీనికి బాధ్యులు ఎవరు? ఢిల్లీ పోలీసులు అమిత్ షా పరిధిలోనే ఉన్నారు, ఆయన దేశానికి సమాధానం చెప్పాలి. యావత్ ప్రతిపక్షం ఇదే కోరుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ బృందంలో సిపిఎం రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిటాస్,ఎఎ రహీమ్, వి. శివదాసన్, సిపిఐ రాజ్యసభ సభ్యుడు పి. సందోష్ కుమార్, సిపిఎం లోక్‌సభ సభ్యులు అమ్రారామ్, సు. వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్