- కేరళ హైకోర్టుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ప్రాణ రక్షణ ఔషధాలు అందుబాటులోకి తీసుకువచ్చే అంశాన్ని, జీవించే హక్కుకు సంబంధించిన అంశాలను సత్వరగతిన న్యాయపరంగా పరిష్కరించే వ్యవహరాలను సుప్రీం కోర్టు శుక్రవారం తనకు తానుగా పరిగణనలోకి తీసుకుంది. త్వరితగతిన పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. కేరళలోని ఎర్నాకులంకు చెందిన ఒక మహిళ బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతూ తన చికిత్సకు అవసరమైన మందులు అసాధారణమైన రీతిలో అధిక ధరలకు విక్రయిస్తుండడాన్ని సవాలు చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా కోరింది. ఆ విచారణ సందర్భంగా ఆ పిటిషనర్ మరణించినట్లు తెలిసింది. 2022లోనే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆమె పిటిషన్ ఇంకా పెండింగ్‌లో వుండగానే ఆమె మరణించారు. ఈ పిటిషన్‌లో విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడివున్నందున సుమోటోగా పిటిషన్‌పై విచారణ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రాణ రక్షణ మందుల అధిక ధరల వ్యవహారంపై అన్న శీర్షికతో ఈ కేసును మార్చింది.








కామెంట్‌లు (0)