ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల్గాంలో ఉగ్రదాడి

1 రోజు క్రితం

terror
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వలస కార్మికుడు మృతి

- మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉగ్రదాడి జరిగింది. కిలామ్‌ ‌గ్రామంలో సాయంత్రం వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కార్మికుడు మృతి చెందగా, అదే ప్రాంతానికి చెందిన మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని అనంత్‌‌నాగ్‌‌లోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌‌లో ఇలాంటి ఉగ్రదాడి ఇటీవల కాలంలో రెండోది. జులై 22న అమర్‌‌నాథ్‌ యాత్ర మార్గంలో జరిగిన ఉగ్రదాడిలో భద్రతా సిబ్బంది ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్