- అస్మితకు నిరాశ
జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ సంచలనం సృష్టించింది. పొంటియానక్‌లో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో అన్మోల్ ఖర్బ్ సెమీఫైనల్‌కు చేరుకోగా, అశ్మిత చలిహ క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన జు వెన్ జింగ్ చేతిలో ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్ అన్మోల్ ఖర్బ్ 21-14, 13-21, 21-17 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ చింగ్ పింగ్‌పై విజయం సాధించింది. మరో పోటీలో అస్మిత చలిహా 10-21, 18-21 తేడాతో చైనాకు చెందిన ప్రపంచ 81వ ర్యాంకర్ జు వెన్ జింగ్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. సెమీస్‌లో అన్మోల్ ఖర్బ్‌తో జు వెన్ జింగ్‌తో తలపడనుంది.







కామెంట్‌లు (0)