- సిర్ట్సియా కూడా..
- యుఎస్ ఓపెన్
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్ అర్యానా సబలెంక, 11వ సీడ్, ఉక్రెయిన్‌కు చెందిన కోస్ట్యూక్ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మూడోరౌండ్ పోటీలో సబలెంక, కోస్ట్యూక్‌తోపాటు 16వ సీడ్ సిర్ట్సియా వరుససెట్లలో ప్రత్యర్ధులను ఓడించారు. సబలెంక 6-4, 6-4తో రఖీమోవా(ఉబ్జెకిస్తాన్)ను, కోస్ట్యూక్ 6-3, 6-2తో 18వ సీడ్, రష్యాకు చెందిన అలెగ్జాండ్రోవాను చిత్తుచేశారు. మరో పోటీలో 16వ సిర్ట్సియా(జర్మనీ) 6-3, 6-3తో 19వ సీడ్ పోలిని(ఇటలీ)ని ఓడించి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. ఇక 4వ సీడ్ గాఫ్(అమెరికా) 6-4, 7-6(7-5)తో బడోసా(స్పెయిన్)ను చిత్తుచేసి మూడోరౌండ్‌కు చేరగా.. 2వ సీడ్, రైబకినా(కజకిస్తాన్) 6-2, 6-4తో బౌజస్(స్పెయిన్), 14వ సీడ్, జోవిక్(అమెరికా) 6-4, 6-4తో ఫ్రాన్‌సెస్క (బ్రిటన్)ను ఓడించారు. ఇక 32వ సీడ్ సక్కారి అనూహ్యంగా రెండోరౌండ్‌లోనే ఓటమిపాలైంది. రెండోరౌండ్ పోటీలో సక్కారి 6-1తో తొలి సెట్ గెలిచినా.. ఆ తర్వాత 6-7(4-7), 2-6తో మిగిలిన రెండు సెట్లను స్టారోదుబ్సేవా(ఉక్రెయిన్) చేతిలో ఓటమిపాలైంది.
జ్వెరేవ్ రెండోరౌండ్‌లోనూ...
పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్, జర్మనీకి చెందిన జ్వెరేవ్ రెండోరౌండ్ గండం గట్టెక్కేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన రెండోరౌండ్ పోటీలో జ్వెరేవ్ 6-4, 4-6, 7-6(7-3), 6-7(3-7), 6-3తో ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్ హేలిన్‌ను ఓడించాడు. ఇక 14వ సీడ్, టియన్(అమెరికా) 6-3, 6-4, 6-3తో మోన్ఫిల్స్(ఫ్రాన్స్), 5వ సీడ్ కోబొలి(ఇటలీ) 3-6, 6-3, 6-4, 7-5తో షూల్కేట్(ఆస్ట్రేలియా)ను చిత్తుచేయగా. 6వ సీడ్, ఆస్ట్రేలియాకు చెందిన డి మినార్ 4-6, 5-7, 2-6తో బి. వాన్(నెదర్లాండ్స్) చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యాడు.







కామెంట్‌లు (0)