- క్వార్టర్‌ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
- చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
షెన్‌జెంగ్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగియగా.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి సెమీస్‌కు చేరారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో 4వ ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ శెట్టి మూడుసెట్ల హోరాహోరీ పోరులో డెన్మార్క్ జంటను చిత్తుచేశారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ను సాత్విక్-చిరాగ్ 21-13, 16-21, 21-18తో అష్ర్టఫ్-రాముసేన్‌లను చిత్తుచేశారు. ఇక పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరి ఆశలు రేపిన మాజీ నంబర్‌వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ 16-21, 16-21తో హాంకాంగ్‌కు చెందిన లీ చౌక్ యు చేతిలో వరుససెట్లలో ఓడాడు.







కామెంట్‌లు (0)