శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోహిత్‌ యాదవ్‌‌పై నిషేధం

1 గంట క్రితం

bcci
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ యువ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు(‌బిసిసిఐ) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంపై ఆరోపణలు రావడంతో బిసిసిఐ చర్యలు చేపట్టింది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఆడేందుకు ఇటీవలే రోహిత్ అండర్ -19 జట్టుకు ఎంపిక అయ్యాడు. కానీ ఈ నిషేధంతో అతడిని జట్టునుంచి తప్పించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రోహిత్ యాదవ్ గత జులైలో అండర్ -19 జట్టుతో శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అనధికారిక టెస్టులో ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఆసీస్‌తో సిరీస్‌‌కు భారత అండర్‌-19 ‌జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడే రోహిత్ యాదవ్ వయసు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా.. వయసులో వ్యత్యాసం తెలిపింది. రోహిత్ వద్ద 2007, 2009, 2010 మూడు ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు బిసిసిఐ గుర్తించింది. ఈ క్రమంలో బోర్డు రోహిత్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించినట్లు అన్ని రాష్ట్రాల బోర్డులకు తెలియజేసింది. క్యాబ్‌ విచారణలో మరో 62 మంది.. 2026-27, 2027-28 సీజన్లలో ఆడేందుకు క్యాబ్‌ బెంగాల్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న క్రికెటర్లలో రోహిత్‌తో పాటు 62 మంది ఆటగాళ్లు అనర్హతకు గురయ్యారు. ఇందులో అండర్ -19 వరల్డ్ కప్ విన్నర్ రవికుమార్, స్పిన్‌ ఆల్‌రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. తాజాగా వీరంతా తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు తేలడంతో వారందరిపై క్యాబ్ అనర్హత వేటు వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్