బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు

1 గంట క్రితం

Neeru-Kynan team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

షూటింగ్‌లో నీరూ–కైనన్‌ జోడీకి పసిడి.. ఆసియా రికార్డు బద్దలు

న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్‌లో 11వ రోజైన బుధవారం భారత్‌ పతకాల వేటలో దూసుకెళ్తోంది. ఆర్చరీలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన భారత్‌.. తాజాగా షూటింగ్‌లోనూ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో నీరూ ధండా–కైనన్‌ చెనాయ్‌ జోడీ స్వర్ణం సాధించడంతో భారత్‌ ఖాతాలో బుధవారం ఇప్పటివరకు మూడు స్వర్ణాలు చేరాయి.

ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ప్రారంభంలో భారత జోడీ 10 టార్గెట్లలో ఆరింటిని మాత్రమే ఛేదించి చివరి స్థానంలో నిలిచింది. అయితే ఆ తర్వాత నీరూ ధండా, కైనన్‌ చెనాయ్‌ అద్భుతంగా పుంజుకున్నారు. ఒక్క టార్గెట్‌ను కూడా మిస్‌ కాకుండా వరుసగా లక్ష్యాలను ఛేదిస్తూ ఆధిక్యంలోకి వచ్చారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత్‌ ఒక్క పాయింట్‌ తేడాతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. ఖతార్‌ రజతం, చైనా కాంస్య పతకాలను సాధించాయి. భారత్‌ మొత్తం 34 పాయింట్లు సాధించి ఆసియా రికార్డును కూడా బద్దలు కొట్టింది. నీరూ ధండాకు ఇది రెండు రోజుల్లో రెండో స్వర్ణ పతకం. అంతకుముందు మహిళల ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో ఆమె పసిడి పతకాన్ని సాధించింది.

ఇక ఆర్చరీలో భారత్‌ ఇప్పటికే రెండు స్వర్ణాలు సాధించింది. మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో చైనాను ఓడించిన భారత జట్టు స్వర్ణం సాధించగా, కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దక్షిణ కొరియాను ఓడించి మరో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణంతో భారత్‌ 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించింది.

ఘంఘాస్‌కు కాంస్యం

బాక్సింగ్‌లో ప్రియ ఘంఘాస్‌ మహిళల 60 కేజీల సెమీఫైనల్లో చైనా బాక్సర్‌ చేతిలో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు లవ్లీనా బోర్గొహైన్‌ మహిళల 75 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి భారత్‌కు కనీసం రజత పతకాన్ని ఖాయం చేసింది.

మహిళల టీమ్‌ స్క్వాష్‌లో తన్వి ఖన్నా, అనాహత్‌ సింగ్‌ జోడీ సింగపూర్‌పై 2–0తో విజయం సాధించి భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్