- కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి అథ్లెట్లుగా రికార్డు
- డిస్కస్ త్రోలో సీమాకు కాంస్యం
- బాక్సింగ్‌లో ఫైనల్‌కు ప్రీతి, అంకుశ్
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో జూడో విభాగంలో భారత అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. ఈ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన తొలి అథ్లెట్లుగా వీరు రికార్డు నెలకొల్పారు. శుక్రవారం జరిగిన జూడో మహిళల 48 కిలోల విభాగంలో అస్మిత దే, పురుషుల 60కిలోల విభాగంలో హర్ష్ సింగ్ స్వర్ణ పతకాలి కైవసం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించాచారు మహిళల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్‌ఫై 2-1తో విజయం సాధించి బంగారు పతకం అందించింది. ఇరువురు తొలి అర్ధభాగం ముగిసేసరికి 1-1పాయింట్లతో సమంగా నిలిచారు. ఈ క్రమంలో చివరి నాలుగు నిమిషాల బౌట్‌లో 23ఏళ్ల అస్మిత మరో పాయింట్ సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డు నెలకొల్పింది. ఇక పురుషుల విభాగం ఫైనల్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషువా కట్జ్‌పై ప్రారంభం నుంచి చెలరేగి ఆడాడు. దీంతో 23ఏళ్ల హర్ష్ 10-0తో జోషువాను చిత్తుచేసి జూడోలో రెండో స్వర్ణ పతకాన్ని భారత్‌కు అందించాడు.
మహిళల డిస్కస్ త్రో విభాగంలో సీమా కళిరామన్ కాంస్య పతకం సాధించింది. మూడో ప్రయత్నంలో 58.65 మీటర్లు విసిరిన సీమా.. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఫౌల్ అయింది. అయినా, కాంస్యం వరించింది. జమైకాకు చెందిన సమంత హాల్ (61.66 మీటర్లు), కెనడా అథ్లెట్ జులియా టంక్స్ (60.67 మీటర్లు) స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. ఒక బిడ్డకు తల్లి అయిన సీమా.. కేవలం 11 నెలల వ్యవధిలోనే డిస్కస్ త్రో పోటీలకు సిద్ధమైంది. గతేడాది జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు దక్కిన పతకాల సంఖ్య 18కు చేరింది. ఇందులో 4 బంగారు పతకాలు, 10 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
బాక్సింగ్‌లో రికార్డు పతకాలు ఖాయం
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. పదిమంది బాక్సర్లు సెమీఫైనల్ చేరి పతకాలు ఖాయం చేయగా.. శుక్రవారం జరిగిన సెమీస్ పోటీలో ప్రీతీ పవార్, అంకుశ్ పంగల్ ఫైనల్‌కు చేరారు. మహిళల 54 కిలోల విభాగం సెమీస్‌లో ప్రీతీ పవార్ 5-0తో జాంబికాకు చెందిన జ్వాపేను ఓడించింది. తొలి రౌండ్ నుంచే ప్రీతి ధాటికి ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. రెండో రౌండ్‌లోనూ అదే దూకుడు కొనసాగించిన భారత అమ్మాయి ఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, ఆమెకు కనీసం రజతం ఖాయమైంది. ఇక పురుషుల 80కిలోల విభాగంలో అంకుశ్ పంగల్ ఫైనల్‌కు చేరాడు.
సెమీఫైనల్లో అంకుశ్ 5-0తో కెనడాకు చెందిన జోషువాను ఓడించాడు. మూడో రౌండ్ చివర్లో ఇద్దరు బాక్సర్లు తీవ్రంగా పిడిగుద్దులతో చెలరేగినా.. అంకుష్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. నలుగురు న్యాయనిర్ణేతలు ఈ పోటీకి 30-26 స్కోరు ఇవ్వగా, ఐదవ న్యాయనిర్ణేత 29-27 స్కోరు ఇచ్చారు. ఇది అంకుష్‌కు గేమ్స్‌లో వరుసగా మూడవ ఏకగ్రీవ పాయింట్ల విజయం, దీనితో అతను ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.








కామెంట్‌లు (0)