- దేశవ్యాప్తంగా విస్తరించిన నిరసనలు
- బడ్జెట్ కోతలపై హైస్కూల్ విద్యార్ధుల ఆగ్రహం
పారిస్: పాఠశాలల దుస్థితిపై ఫ్రాన్స్‌లో హైస్కూల్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. గత రెండు రోజుల్లో పోలీసులు బలప్రయోగం చేశారు. మూడు వేలకు మందికి పైగా విద్యార్థులు, అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఒక్కరోజే 1,949 మంది నిర్బంధానికి గురయ్యారు. శుక్రవారం నాటికి సుమారు 400 పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్ధులపై మాక్రాన్ ప్రభుత్వం విరుచుకుపడింది. బాష్పవాయువు గోళాలు, లాఠీచార్జీలతో అణిచేస్తుంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పారిస్ నగరంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రులు పర్యటనలు రద్దు చేసుకున్నారు.
పాఠశాలల్లో వసతుల కోసం విద్యార్థుల పోరు..
సెప్టెంబర్ మధ్యలో పారిస్ శివారు లిసేల్లో (15-18 ఏళ్ల విద్యార్థులు చదివే ఉన్నత మాధ్యమిక పాఠశాలలు) చిన్నగా మొదలైన నిరసనలు, సామాజిక మాధ్యమాల ద్వారా దేశమంతటా వ్యాపించాయి. దేశంలోని 3,700 లిసేల్లో 1,027 ప్రభావితమయ్యాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. 30 విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలోనూ దిగ్బంధంచారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ కోతలపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకిస్తూ వారు ఉద్యమంలో భాగమయ్యారు. ఉపాద్యాయులను నియమించాలని, నూతన స్కూల్ భవనాలు నిర్మించాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని, బడ్జెట్‌లో నిధులు పెంచాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఉపాద్యాయులు, సిబ్బంది తమ జీతాలు పెంచాలని ఆందోళనలు చేస్తున్నారు. అయితే. విద్యార్ధులను వామపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి లారెంజ్ నూనెజ్ విమర్శించారు. ఎల్ఎఫ్‌ఐ పార్టీ అధ్యక్షులు మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వం రాజికీయాలు మాని విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. పొరుగున ఉన్న బెల్జియంలోనూ విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తడం గమనార్హం.







కామెంట్‌లు (0)