శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు, రేపు ఐలు రాష్ట్ర మహాసభ

1 గంట క్రితం

ailu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 800 మంది ప్రతినిధులు హాజరు

- సింహపురి ముస్తాబు

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి : అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) 13వ రాష్ట్ర మహాసభలకు నెల్లూరు నగరం ముస్తాబైంది. శుక్ర, శనివారం రెండు రోజుల పాటు నగరంలోని కస్తూరిబా కళా క్షేత్రంలో జరిగే ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్లు ఐలు తోరణాలు, ప్లెక్సీలతో నిండిపోయాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్ మహాసభను ప్రారంభిస్తారు. ఐలు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. మూడేళ్లలో జరిగిన పోరాటాలు, మరో మూడేళ్లకు అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలను రెండు రోజుల పాటు జరిగే మహాసభలో తయారు చేస్తారని ఐలు సీనియర్ నాయకులు బివి.రామణారెడ్డి తెలిపారు. ప్రధానంగా రాష్ట్రంలో లాయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో చర్చించనున్నారు. నెల్లూరులోని కస్తూరిబా కళాక్షేత్రం, కెవిఆర్ పెట్రోల్‌ బంకు, ఆర్‌టిసి, అంబేద్కర్ బొమ్మ, గాంధీ బొమ్మలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. రెండో రోజు నూతన కమిటీ ఎన్నిక జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్