శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

1 గంట క్రితం

దేశవ్యాప్తంగా నిరసనల హోరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : బిజెపి, సంఘ్‌ పరివార్‌ కీలుబొమ్మగా ఒంటెత్తు పోకడలతో వ్యవహరించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఆయనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. దీంతో పాటు శుక్రవారం నాడే ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుత ఆందోళనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ కూడా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు మిన్నంటాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపడం సిగ్గు చేటు అని కేరళ మాజీ సిఎం పినరయి విజయన్‌ అన్నారు. అలాగే కోజికోడ్‌లో జరిగిన ఆందోళనల్లో రాష్ట్ర మాజీ మంత్రి మహ్మద్‌ రియాజ్‌ పాల్గొన్నారు. ముంబయి శివాజీపార్కులో జరిగిన యువతపోరులోనూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సిఇసి రాజీనామాకు డిమాండ్‌ చేశారు. బీహార్‌లో నిర్వహించిన ఆందోళనల్లో సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధానకార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య పాల్గొన్నారు. సిఇసి అక్రమాలపై నిష్పాక్ష‍ిక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్