- బాక్సింగ్‌లో మూడు, మహిళల హాకీ, రెజ్లింగ్, ఆర్చరీలో పసిడి
- నేడు క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
- ముగింపు వేడుకల ఫ్లాగ్ బేరర్‌గా నీరు దండా
ఐచి-నగోయా(జపాన్) : 20వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలిసారి పతకాల పంట పండింది. ఒకేరోజు ఆరు స్వర్ణాలతో సహా మొత్తం 12 పతకాలు దక్కాయి. మహిళల బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాల్లో తొలిసారి స్వర్ణ పతకాలను సాధించి రికార్డు నెలకొల్పింది. మహిళల హాకీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆసియా ఫేవరెట్ చైనాపై భారత జట్టు 1-0తో విజయం సాధించి 44ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నేరుగా 2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం. ఇక బాక్సింగ్ విభాగంలో గతసారి రజత పతకంతో మెరిసిన లౌవ్లీనా బోర్గోహైన్ ఈసారి ఏకంగా స్వర్ణ పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. ఆర్చరీలో మరో బంగారు పతకం దక్కింది.
అదరగొట్టిన బాక్సర్లు: మహిళా బాక్సర్లు లౌవ్లీనా బోర్గోహైన్, పర్వీన్ హుడా బాక్సింగ్ ఫైనల్లో పవర్ ఫుల్ పంచ్‌లతో అదరగొట్టారు. తొలుత 75 కేజీల విభాగంలో లౌవ్లీనా 2-0 తేడాతో చైనాకు చెందిన బావో జియిని ఓడించి బంగారు పతకాన్ని సాధించింది. తద్వారా 12 ఏళ్ల తర్వాత బాక్సింగ్ విభాగంలో లౌవ్లీనా తొలి ఆసియా గేమ్స్ స్వర్ణాన్ని అందించింది. అలాగే ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా లౌవ్లీనా చరిత్ర సృష్టించింది. అంతకుముందు దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 ఇంచెయాన్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. ఇక 65 కేజీల విభాగంలో పర్వీన్ చైనీస్ తైపీ బాక్సర్ నీన్ చిన్ చెన్‌ను 3-2 తేడాతో ఓడించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తొలి రౌండ్‌ను 5-0తో గెలిచిన పర్వీన్ హుడా.. రెండో రౌండ్‌ను 0-5తో ఓడిపోయింది. ఇక మూడో రౌండ్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే స్వర్ణం సాధించిన మూడో బాక్సర్‌గా నిలిచింది. ఆమె కన్నా ముందు మేరీ కోమ్(51 కేజీలు) 2014 ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించింది. తాజా ఎడిషన్‌లో లవ్లీనా బొర్గోహైన్ మహిళల 75 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక పురుషుల 80కిలోల విభాగంలో అంకుష్ ఫైనల్‌లో 4-0 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సూయింగ్‌పై విజయం సాధించి బాక్సింగ్ విభాగంలో మూడో స్వర్ణ పతకాన్ని అందించాడు.
రెజ్లింగ్‌లో సూపర్ పట్టు: రెజ్లర్ సుజీత్ కల్‌కల్ పురుషుల 65కిలోల విభాగంలో సూపర్ పట్టుతో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్ ఛాంపియన్, తజకిస్థాన్‌కు చెందిన కుదీవ్‌తో తలపడిన సుజీత్ ఫైనల్లో తొలుత వెనుకబడ్డ సుజీత్.. ఆ తర్వాత రెండో రౌండ్‌లో అనూహ్య రీతిలో పర్ఫార్మ్ చేశాడు. తజకిస్తాన్ ప్లేయర్ అబ్దుల్‌మజీద్ కుదేవ్‌ను 10-9 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి తొలి రౌండ్‌లో సుజీత వెనుకబడ్డాడు. ఆ రౌండ్‌లో 9-2 తేడాతో తజక్ ప్లేయర్ దూకుడు ప్రదర్శించాడు. కానీ రెండో రౌండ్‌లో అద్భుతంగా రాణించి 8-0 తేడాతో ఉన్నాడు. ఓవరాల్‌గా 10-9 పాయింట్లతో గోల్డ్ మెడల్ బౌట్‌లో విజయం సాధించాడు.
చరిత్ర సృష్టించిన మహిళల రికర్వ్ ఆర్చరీ టీమ్: ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత ఆర్చర్లు అంకిత భక్త్, కీర్తి శర్మ, కుమ్‌కుమ్ మోహద్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. 10 సార్లు ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాను ఫైనల్లో ఓడించి తొలిసారి పసిడి సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 10 సార్లు ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాపై 5-3 తేడాతో విజయం సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టుకు స్వర్ణ పతకం దక్కడం ఇదే తొలిసారి.
మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ దీప్తి కుమారి సెలెక్షన్ ట్రయల్స్‌లో విఫలం కావడంతో ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక కాలేదు. అయితే ఆమె స్థానంలో వచ్చిన కీర్తి శర్మ అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. చివర్లో చికీలకమైన పాయింట్లు సాధించి 4-2 ఆధిక్యాన్ని పొందింది. ఇక వత్తిడిలో పడిన దక్షిణ కొరియా నాలుగో సెట్‌లో 54 పాయింట్లు సాధించింది. భారత బృందం కూడా 54 స్కోరు చేయడంతో పాయింట్ల ఆధారంగా ఇండియా అగ్రస్థానంలో నిలిచింది.
సెపక్‌తక్రాలో కాంస్యం: సెపక్‌తక్రాలో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. సెమీస్‌లో భారత్‌పై జపాన్ విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌కే పరిమితమైన భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శుక్రవారం భారత్‌కు ఆసియా క్రీడల్లో పతకాల పంట పండడంతో ఏకంగా టాప్-5లో చోటు దక్కించుకుంది. భారత్ ఖాతాలో 16స్వర్ణాలతోపాటు, 25 రజత, 35 కాంస్య పతకాలతో సహా మొత్తం 76పతకాలు ఉన్నాయి.







కామెంట్‌లు (0)