సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బైబై గ్లాస్గో..

03 ఆగస్టు, 2026

common
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 06:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఘనంగా ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌

  • నాల్గో స్థానంలో భారత్‌ !

  • చివరి రోజు నిరాశ

  • అహ్మదాబాద్‌‌లో 2030 గేమ్స్‌

గ్లాస్గో : 11 రోజుల పాటు జరిగిన 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆదివారంతో ముగిసాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది సామర్థ్యం ఉన్న గ్లాస్గోలోని ప్రసిద్ధ హైడ్రో అరీనాలో ముగింపు వేడుకలు జరిగాయి. దీంతో గ్లాస్గోకు కామన్వెల్త్‌ ‌గేమ్స్‌ ‌బైబై చెప్పాయి. 2030లో జరిగే 24వ కామన్వెల్త్ క్రీడలకు భారత్‌‌లోని అహ్మదాబాద్‌ ఆతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా, గ్లాస్గోలో భారత్‌ ‌బృందం అంచనాలకు మించి రాణించింది. మొత్తం 39 పతకాలతో నాలుగోస్థానంలో నిలించింది. భారత్‌ ‌తన పోరును 13 స్వర్ణాలు, 17 రజతాలు, తొమ్మిది కాంస్యాలతో ముగించింది. ఈవెంట్ చివరి రోజున ఒక్క పతకాన్ని కూడా సాధించలేకపోయింది. నిజానికి భారత్, స్కాట్లాండ్‌లకు సరిగ్గా సమాన సంఖ్యలో స్వర్ణ పతకాలు, మొత్తం పతకాలు ఉన్నాయి. దీంతో ఎక్కువ రజత పతకాలు సాధించిన భారత్‌ ప్రస్తుతానికి అది స్కాట్లాండ్ కంటే ముందు స్థానంలో ఉంది. ఒకవేళ స్కాట్లాండ్ మరో స్వర్ణం గెలిస్తే, భారత్ ఐదో స్థానానికి పడిపోతుంది. ఏదేమైనా సరే భారత్‌ ఈ గేమ్స్‌‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిందే చెప్పాలి. బాక్సింగ్‌లో రికార్డు స్థాయిలో 10 పతకాలు,అథ్లెటిక్స్‌లో అపూర్వ విజయాలు, జూడోలో చారిత్రాత్మక విజయం, పారా క్రీడలలో మైలురాయి విజయాలతో నాల్గో స్థానంలో నిలిచింది. ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌, కెనడాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

table.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్