సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జకోవిచ్‌, సెరేనా తొలిరౌండ్‌లో ఓటమి

1 గంట క్రితం

d jacovic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- యుఎస్‌ ఓపెన్‌‌లో పెను సంచలనం

- 20ఏళ్ల అర్జెంటీనా యువ ఆటగాని చేతిలో పరాభవం

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ పురుషుల సింగిల్స్‌‌లో పెను సంచలనం నమోదైంది. సెర్బియాకు చెందిన 4వ సీడ్‌, నొవాక్‌ ‌జకోవిచ్‌ అనూహ్యంగా తొలిరౌండ్‌‌లోనే ఇంటిదారి పట్టాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌ ‌పోటీలో జకోవిచ్‌ 6-7(5-7), 7-5, 6-4, 2-6, 1-6తో అన్‌‌సీడెడ్‌, అర్జెంటీనాకు చెందిన నవోన్‌ ‌చేతిలో పరాజయం పాలయ్యాడు. సుమారు నాలుగు గంటల 36 నిమిషాల సేపు సాగిన హోరాహోరీ పోరులో అర్జెంటీనా ఆటగాడు మరియానో ​​నవోనే ఒత్తిడికి లోనైన బలహీనుడి పాత్ర పోషించడానికి నిరాకరించాడు. ఇక 15వ సీడ్‌ ‌బబ్లిక్‌(‌కజకిస్తాన్‌) 6-4-, 6-2, 3-6, 6-1తో వూల్స్‌(అమెరికా)ను చిత్తుచేయగా.. అన్‌‌సీడెడ్‌, కెనడాకు చెందిన షపోవలోవ్‌ 6-4, 4-6, 6-4, 6-1తో ఎం. కెక్‌‌మనోవిక్‌(‌పోర్చుగల్‌)‌ను ఓడించి రెండోరౌండ్‌‌కు చేరాడు.

తొలి రౌండ్‌లోనే వీనస్‌ విలియమ్స్‌ ఓటమి...

మహిళల సింగిల్స్‌‌లో మరో సంచలనం నమోదైంది. నొవాక్‌ ‌జకోవిచ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా.. అదే బాటలో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌కు కూడా పయనించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మొదటి రౌండ్‌లో సోఫియా కెనిన్‌తో తలపడ్డ వీనస్‌ వరుస సెట్లలో 6-2, 7-6 (6) తేడాతో ఓటమిపాలైంది. కాగా జూలై 2025లో చివరిసారిగా సింగిల్స్‌ మ్యాచ్‌ గెలిచిన 46 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌కు ఇది వరుసగా 14వ ఓటమి. అంతేకాదు 2019 తర్వాత వీనస్‌ తొలి రౌండ్‌లోనే వరుసగా ఓడిపోవడం ఇది ఆరోసారి. తొలిసెట్‌‌ను కేవలం 32 నిమిషాల వ్యవధిలోనే ఆమె సొంతం చేసుకుంది. వీనస్‌ రెండో సెట్‌లో ఆకట్టుకుంది. కానీ ఆఖరికి సోఫియానే పైచేయి సాధించింది. కాగా అమెరికాకే చెందిన సోఫియా కెనిన్‌ వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2020లో ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా కెనిన్‌ నిలిచింది. దీంతో ఇద్దరు అమెరికా క్రీడాకారిణుల మధ్య జరిగిన పోరులో కెనిన్‌ 6-2, 7-6(8-6)తో వీనస్‌ ‌విలియమ్స్‌‌ను ఓడించింది. ఇతర పోటీల్లో 26వ సీడ్‌, అమెరికాకు చెందిన నవర్రో 7-6(8-6), 4-2తో లోయిస్‌(‌ఫ్రాన్స్‌)‌ను, 9వ సీడ్‌, స్విటోలినా(ఉక్రెయిన్‌) 6-1, 6-2తో సియెర్రా(అర్జెంటీనా)ను ఓడించి రెండోరౌండ్‌‌కు చేరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్