సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సర్వం సిద్ధం..

1 గంట క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 01:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సింహపురిలో నేటి నుంచి డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభ

- తొలిరోజు భారీ ర్యాలీ, బహిరంగ సభ

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజా, యువజన ఉద్యమాల పురిటి గడ్డ నెల్లూరు (సింహపురి)...డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభకు సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడ్రోజులపాటు ఇక్కడ జరిగే మహాసభకు అన్ని ఏర్పాట్లనూ ఆహ్వాన సంఘం పూర్తి చేసింది. గోడ రాతలు, కరప్రతాలు, పోస్టర్‌ ఆవిష్కరణ, లోగో ఆవిష్కరణ వంటి కార్యక్రమాలతోపాటు మహాసభ విశిష్టతను తెలుపుతూ ఆటోల ద్వారా వాడవాడలా ముమ్మరంగా ప్రచారం సాగింది. జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో డివైఎఫ్ఐ పతాకావిష్కరణలు జరిగాయి. తొలిరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరులోని విఆర్ సి మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు నర్తకి సెంటర్ కు చేరనుంది. అక్కడ బహిరంగ సభ జరగనుంది. డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు, ఎంపి ఎఎ.రహీం, జాతీయ ఉపాధ్యక్షులు జాక్ సి. థామస్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. డివైఎఫ్ఐకు నెల్లూరు జిల్లాలో ఘనమైన చర్రిత ఉంది. అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం జరిగిన పోరాటాల్లో అగ్రభాగాన నిలిచింది. నక్సలైట్లు, మతోన్మోదుల చేతుల్లో డివైఎఫ్ఐ నాయకులు మస్సూర్, గోను చలపతి, చెంచయ్య అసువులు బాశారు. డ్రగ్స్‌, గంజాయికి వ్యతిరేకంగా పోరాడు తున్న కె.పెంచలయ్య ఇటీవల గంజాయి బ్యాచ్ చేతిలో అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న మహాసభ ప్రాధాన్యతను సంతరించుకుంది. నెల్లూరు నగరాన్ని అలకించారు. ప్రధాన కూడళ్లలో డివైఎఫ్ఐ తోరణా లు, పతాకాలు రెపరెపలాడుతున్నాయి. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న నెల్లూరుకు ఇప్పటికే చేరు కొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 2, 3 తేదీల్లో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్జాన కేంద్రంలో జరిగే ప్రతినిధుల సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది హాజరు కానున్నారు. ర్యాలీని, బహిరంగ సభను, మహాసభను విజయవంతం చేయాలని రామన్న కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్