బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గుల్వీర్‌కు చారిత్రాత్మక రజతం

12 గంటల క్రితం

common wealth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 09:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 10,000 మీటర్ల పరుగులో భారత్‌కు తొలి పతకం!

గ్లాస్గో: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెటిక్స్‌ మరో ఘనత సాధించారు. లాంగ్-డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల పరుగులో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఈవెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్‌లో గుల్వీర్ 27 నిమిషాల 49.78 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. వర్షం కారణంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ, తెలివైన వ్యూహంతో పరుగెత్తిన అతడు చివరి ల్యాప్ ప్రారంభంలో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే చివరి క్షణాల్లో అద్భుతమైన వేగాన్ని ప్రదర్శించి ప్రత్యర్థిని అధిగమించి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ రేసులో ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ స్వర్ణ పతకం గెలుచుకోగా, ఐల్ ఆఫ్ మ్యాన్ అథ్లెట్ డేవిడ్ ముల్లార్కీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

కామన్వెల్త్ గేమ్స్ లాంగ్-డిస్టెన్స్ ట్రాక్ ఈవెంట్లలో కెన్యా, ఉగాండా వంటి తూర్పు ఆఫ్రికా దేశాలు దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ, గుల్వీర్ సింగ్ ఈ చారిత్రాత్మక విజయంతో భారత అథ్లెటిక్స్‌కు కొత్త మైలురాయిని అందించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్