గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫైనల్‌కు హర్మన్‌ప్రీత్‌ బృందం

20 నిమిషాల క్రితం

sel;fi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 11:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో భారత మహిళల గెలుపు

దుబాయ్‌: మహిళల ఆసియాకప్‌ ‌ఫైనల్లోకి భారతజట్టు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత మహిళలజట్టు 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 109పరుగులే చేసింది. తొలుత ఓపెనర్‌ ‌షెఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. కేవలం 40 బంతుల్లో 7ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 64పరుగులు చేసింది. కెప్టెన్‌ ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌(24నాటౌట్‌)‌కి తోడు రీచా ఘోష్‌(21), ప్రతికా రావల్‌(20) బ్యాటింగ్‌‌లో రాణించడంతో తొలిగా బ్యాటింగ్‌‌కు దిగిన భారత మహిళలజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగుల భారీస్కోర్‌ ‌చేసింది. అర్ధసెంచరీతో రాణించిన షెఫాలీ వర్మకు ఆసియాకప్‌ ‌టోర్నీలో ఇది నాల్గోది. బంగ్లా బౌలర్లు మారుఫా అక్తర్ 4 ఓవర్లలో 40 పరుగులకు ఒక వికెట్, నహిదా అక్తర్ 4 ఓవర్లలో 25 పరుగులకు ఒక వికెట్, రాబేయా ఖాన్ 4 ఓవర్లలో 22 పరుగులకు ఒక వికెట్ పడగొట్టారు.

ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్‌ ఓపెనర్లు దిలారా(21)కి తోడు ఫర్దూస్‌(14), శోభన(18), నిగర్‌ సుల్తానా(19)కి తోడు షోర్నా అక్తర్‌(22నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించగా.. భారత బౌలర్లు దీప్తి శర్మ(3/26)కి తోడు నందిని శర్మ రెండు వికెట్లతో రాణించారు. శ్రీచరణి, ప్రేమ రావత్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ మహిళలు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమయ్యారు.

స్కోర్‌‌బోర్డు...

ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: మంధాన (సి)షోర్నా అక్తర్ (బి)సుల్తానా ఖాతూన్‌ 2, షెఫాలీ వర్మ (సి)ఫర్జానా ఈస్మిన్‌ (‌బి)సుల్తానా ఖాతూన్‌ 64, ప్రతికా రావల్‌ (సి)దిలారి అక్తెర్‌ (‌బి)రూబెయా ఖాన్‌ 20, హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ (‌నాటౌట్‌) 24, రీచా ఘోష్‌ (‌స్టంప్‌)నిగర్‌ ‌సుల్తానా (బి)నహిదా అక్తెర్‌ 21, దీప్తి శర్మ (సి)రబెయా ఖాన్‌ (‌బి)మరుఫా అక్తెర్‌ 13, భారతి ఫుల్మాలీ (రనౌట్‌)‌నిగర్‌ ‌సుల్తానా/మరుఫా అక్తెర్‌ 0, అదనం 5. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149పరుగులు. వికెట్ల పతనం: 1/9, 2/59, 3/92, 4/128, 5/149, 6/149 బౌలింగ్‌: మరుఫా అక్తెర్‌ 4-0-40-1, సుల్తానా అక్తెర్‌ 3-0-30-2, నహిదా అక్తెర్‌ 4-0-25-1, రుబెయా 4-0-22-1, ఫాతిమా 4-0-21-0, షోర్నా 1-0-10-0.

బంగ్లాదేశ్‌ మహిళల ఇన్నింగ్స్‌: దిలారా అక్తెర్‌ (సి)క్రాంతి గాడ్‌ (బి)దీప్తి 21, ఫెర్దాస్‌ (సి)రీచా (బి)శ్రీచరణి 14, శోభన (బి)దీప్తి 18, నిగర్‌ సుల్తానా (సి)నందిని శర్మ (బి)ప్రఏమా రావత్‌ 19, షోర్నా అక్తర్‌ (నాటౌట్‌) 22, షర్మీన్‌ అక్తర్‌ (బి)దీప్తి 1, ఫాతిమా ఖాతూన్‌ (సి)ప్రేమా (బి)నందిని 14, రూబెయా ఖాన్‌ (హిట్‌ వికెట్‌) నందిని 0, (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 109 పరుగులు. వికెట్ల పతనం: 1/26, 2/35, 3/66, 4/76, 5/83, 6/109, 7/109 బౌలింగ్‌: క్రాంతి గాడ్‌ 2-0-13-0, నందిని శర్మ 2-0-10-2, శ్రీచరణి 4-1-14-1, షెఫాలీ వర్మ 4-0-25-0, ప్రేమా రావత్‌ 4-0-21-1, దీప్తి శర్మ 4-0-26-3.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్