- మేక్‌మైట్రిప్
న్యూఢిల్లీ: ప్రయాణ తేదీకి ముందు విమాన టికెట్ ధర తగ్గినప్పుడు వ్యత్యాస మొత్తాన్ని తిరిగి చెల్లించేలా మేక్‌మైట్రిప్ ‘ప్రైస్ డ్రాప్ ప్రొటెక్షన్’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశీయ విమానాలకు ఒక్కో ప్రయాణికుడికి రూ.229 నుంచి, అంతర్జాతీయ విమానాలకు రూ.349 నుంచి అదనపు ఛార్జీతో దీన్ని పొందవచ్చు. దేశీయ వన్‌వే టికెట్‌కు గరిష్ఠంగా రూ.2,500, రౌండ్‌ట్రిప్‌కు రూ.5,000, అంతర్జాతీయ వన్‌వేకు రూ.3,000, రౌండ్‌ట్రిప్‌కు రూ.6,000 వరకు ధర వ్యత్యాసాన్ని వాపసు చేస్తామని సంస్థ తెలిపింది.







కామెంట్‌లు (0)