శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పవర్‌ ‌లిఫ్టింగ్‌‌లో జండు కుమార్‌‌కు కాంస్యం

1 గంట క్రితం

znadu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

-‌ బాక్సింగ్‌‌లో పతకానికి చేరువలో సచిన్‌

గ్లాస్గో: 23వ కామన్వెల్త్‌ ‌క్రీడల్లో మూడోరోజు భారత్‌‌కు ఒక కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన పవర్‌ ‌లిఫ్టింగ్‌‌లో జండు కుమార్‌ ‌కాంస్య పతకం సాధించి భారత్‌‌కు పతకాల పట్టికలో చోటు కల్పించాడు. ఇక 60కిలోల పురుషుల బాక్సింగ్‌‌లో సచిన్‌ ‌కుమార్‌ ‌రౌండ్‌-32లో 4-1తో స్కాట్లాండ్‌‌కు చెందిన ఇవెంట్‌ ‌క్యాంపస్‌‌పై విజయం సాధించి ప్రీ క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరాడు. ఇక 3-3 వీల్‌‌చైర్‌ బాస్కెట్‌ ‌బాల్‌, లాన్‌ ‌బాల్స్‌‌లో భారత అథ్లెట్లు పతకాల దిశగా దూసుకెళ్తున్నారు. పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ శ‌నివారం జరిగిన పురుషుల హెవీవెయిట్ ఫైనల్లో జండు కుమార్ తొలి ప్రయత్నంలో 181 కిలోల బరువును సునాయసంగా ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తగా.. మూడో ప్రయత్నంలో 196 కిలోలు ఎత్తడంలో స్వల్ప తేడాతో విఫలమయ్యాడు.

దీంతో రెండో ప్రయత్నంలో 190 కిలోలను విజయంగా ఎత్తడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 132.8 పాయింట్లతో స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131.0 పాయింట్లుతో రజత పతకం దక్కించుకున్నాడు. కేవలం 0.1 కిలో తేడాతో ఝండూ రజత పతకాన్ని చేజార్చుకోవడం గమనార్హం. భారత్‌‌కు తొలి పతకం అందించిన జండు కుమార్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. 50మీ. ప్రీస్టైల్‌ బ్యాక్‌‌స్టోక్‌ ‌స్విమ్మింగ్‌‌లో సెమీస్‌‌కు చేరి పతకంపై ఆశలు రేపిన శ్రీహరి నటరాజన్‌.. ఫైనల్‌‌కు చేరడంలో విఫలమయ్యాడు. శనివారం జరిగిన హీట్‌-1లో నటరాజన్‌ 8మంది పాల్గొన్న సెమీస్‌లో 7వ స్థానానికే పరిమితమయ్యాడు. లాన్‌ ‌బాల్స్‌‌లో భారత్‌‌కు చెందిన సోనోవాల్‌ ‌రౌండ్‌-3‌లో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు గేమ్‌‌లలో గెలిచి టాప్‌‌లో నిలిచిన సోనోవాల్‌.. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ‌సెక్షన్‌-‌డి మూడో రౌండ్‌‌లో మలేషియాకు చెందిన డుకెప్లె చేతిలో 4-8, 8-9తో పరాజయాన్ని చవిచూశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్