- రేపటి నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్
తిరువనంతపురం: వెస్టిండీస్ జట్టు భారత్‌తో వైట్‌బాల్ సిరీస్ ఆడేందుకు వచ్చింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా విండీస్‌తో మూడు వన్డేల, ఐదు టి20ల సిరీస్ ఆడనుంది. తిరువనంతపురంలో ఆదివారం జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శుక్రవారం నెట్ ప్రాక్టీస్ చేశారు. అయితే.. గత 24 ఏళ్లలో విండీస్ జట్టు భారతగడ్డపై ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. దాంతో.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలంటే షాయ్ హోప్ బృందం సర్వశక్తులు ఒడ్డాల్సిందే. చివరిసారిగా 2002లో విజయం సాధించిన కరీబియన్ టీమ్ చరిత్రను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఒకప్పుడు మేటి జట్టుగా ప్రపంచ క్రికెట్‌ను శాంసించిన వెస్టిండీస్ ఇటీవలికాలంలో నిరాశపరుస్తోంది. స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్స్‌కు ప్రధాన్యమివ్వడం, బోర్డుతో విబేధాలు.. వంటివి విండీస్ క్రికెట్‌ను నాశనం చేశాయి. ఈ పరిస్థితుల్లో.. నేరుగా వన్డే ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించలేదు.
షెడ్యూల్...
వన్డే సిరీస్...
27(ఆది) : తొలి వన్డే (తిరువనంతపురం)
30(బుధ) : రెండో వన్డే (గౌహతి)
అక్టోబర్ 3 : మూడో వన్డే (ఛండీగడ్)
టి20 సిరీస్...
6 (మంగళ) : తొలి టి20 (లక్నో)
9 (శుక్ర) : రెండో టి20 (రాంచీ)
11(ఆది) : మూడో టి20 (ఇండోర్)
14(బుధ) : నాల్గో టి20(హైదరాబాద్)
17(శని) : ఐదో టి20(బెంగళూరు)







కామెంట్‌లు (0)