ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : పైన పటారం లోన లొటారం అంటే ఇదేనేమో...! బయటికి మాత్రం చూస్తే శుద్ధ చల్లని నీరుగా కనిపిస్తున్న ఈ వాటర్ క్యాన్లను చూస్తే ఎవరికైనా అనిపించకమానదు. అయితే అందులో నీరు తాగినప్పుడే అది శుద్ధ జలం కాదన్నది తేటతెల్లమయింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల నామినేషన్లు హాలు వద్ద ఏర్పాటు చేసిన వాటర్ దుస్థితి ఇది. స్థానికంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు అంతగా పట్టించుకోలేదని స్థానిక నామినేషన్ వేసేందుకు వచ్చిన సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ఉన్న టెంట్లను కూడా పీకేసి మరల 10 గంటల తర్వాత ఏర్పాటు చేయడం పై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై మీడియా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం గమనార్హం.
మినరల్ వాటర్ కాదు.. జనరల్ వాటర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 10:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)