జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. పోటీల తొలిరోజైన సోమవారం, భారత పారా షూటర్లు.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో భారత క్రీడాకారిణులు మోనా అగర్వాల్ స్వర్ణం, అవనీ లేఖరా రజతం సాధించారు. ఈ గేమ్స్‌లో భారత్‌కు ఇవే తొలి పతకాలు కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో మోనా అగర్వాల్ 250.0 పాయింట్లతో ఆసియా పారా గేమ్స్ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కేవలం 0.4 పాయింట్ల స్వల్ప తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అవనీ లేఖరా వెనుకబడింది. అవనీ 249.6 పాయింట్లతో రజత పతకంతో సరిపెట్టుకుంది. దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రి 227.9 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది.
వరల్డ్ రికార్డు సమం చేసిన శీతల్ దేవి
పారా ఆర్చరీ విభాగంలో భారత సంచలనం శీతల్ దేవి సరికొత్త అధ్యాయం లిఖించింది. మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో శీతల్ దేవి 720 పాయింట్లకు గాను ఏకంగా 704 పాయింట్లు సాధించింది. ఈ ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేయడమే కాకుండా, పాత ఆసియా రికార్డును 6 పాయింట్ల తేడాతో అధిగమించి కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది.








కామెంట్‌లు (0)