- సౌత్‌జోన్‌కు ఆధిక్యత
- దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ జట్టు బ్యాటర్ తిలక్ వర్మ అజేయ శతకంతో మెరిసాడు. దీంతో బిసిసిఐ సెంట్రల్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో జరుగుతున్న దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో నార్త్‌జోన్‌పై సౌత్ జోన్ జట్టు ఆధిక్యతను సంపాదించింది. కెప్టెన్ తిలక్ వర్మ(106నాటౌట్) సెంచరీకి తోడు, శ్రేయస్ గోపల్(88) అర్ధసెంచరీతో రాణించారు. దీంతో రెండోరోజు ఆట నిలిచే సమయానికి సౌత్‌జోన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 285పరుగులు చేసింది. దీంతో నార్త్‌జోన్‌పై ఇప్పటికే 90 పరుగుల ఆధిక్యతను సంపాదించింది. నార్త్‌జోన్ బౌలర్లు గుర్నూర్ బ్రార్‌కి నాలుగు వికెట్లకి తోడు ఆర్స్‌దీప్ సింగ్, కంబోజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు నార్త్‌జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 195పరుగులకు కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఈస్ట్‌జోన్ 266ఆలౌట్...
బిసిసిఐ సెంట్రల్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఈస్ట్, సెంట్రల్ జోన్ జట్లు తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే ఆలౌటయ్యాయి. ఈస్ట్‌జోన్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(92), అభిమన్యు ఈశ్వరన్(69) తొలి వికెట్‌కు 161పరుగులు జతచేసినా.. ఆ తర్వాత బ్యాటర్లంతా 105పరుగులే చేశారు. సెంట్రల్ జోన్ బౌలర్లు హర్ష్ దూబేకు నాలుగు, ఆర్యాన్ పాండే, యశ్ ఠాకూర్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రాంభించిన సెంట్రల్ జోన్ జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ఛండేలా(2), అమన్ జుయెల్(8), కెప్టెన్ రజత్ పటీధర్(5) స్వల్పస్కోర్లకే పెవీలియన్‌కు చేరగా.. అమన్(23), అర్యాన్(4) క్రీజ్‌లో ఉన్నారు.








కామెంట్‌లు (0)