మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాలకుల తప్పిదం వల్ల 22ఎలో 14 లక్షల ఎకరాలు

3 గంటల క్రితం

ab venkateswara rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలగించడానికి వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేలు, తహశీల్దార్లు

  • సెంటర్ ఆఫ్ లిబర్టీ చైర్మన్ ఎబి.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి - నంద్యాల : పాలకుల తప్పిదాల వల్లే 22ఎలో 14 లక్షల ఎరాలు ఉన్నాయని, వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటే ఎంఎల్‌ఎలు, తహశీల్దార్లు వాటాలు అడుగుతున్నారని మాజీ డిజిపి, సెంటర్ ఆఫ్ లిబర్టీ చైర్మన్ ఎబి.వెంకటేశ్వరరావు ఆరోపించారు. సెంటర్ ఫర్ లిబర్టీ వారి ఆస్తి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రోల్ బ్యాక్ 22ఎ ఉద్యమంలో భాగంగా మంగళవారం నంద్యాలలోని ఓ లాడ్జిలో వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా నిషిద్ధ జాబితాలో పెట్టడానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. నంద్యాలలోని బాధితుల కోసం సమిష్టి పోరాటం చేస్తామన్నారు. పద్మావతి నగ‌ర్‌కు సంబంధించి వంద మంది బాధితులు వారి సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. 50 ఏళ్లుగా నంద్యాల మున్సిపాలిటీలో పోరాడుతున్న ప్లాట్ యజమానులకు మద్దతు ఇస్తామన్నారు. నంద్యాలలో బాధితుల నుంచి వచ్చిన అర్జీల్లో 90 శాతం 22ఎ బాధితులే ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషన‌ర్‌తో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకున్నాక భవిషత్తు కార్యాచరణ చేపడతామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్