మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజిఎస్‌‌టిలో 18శాతం వృద్ధి

1 గంట క్రితం

gst
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగో స్థానం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో పన్నుల ఆదాయం గణనీయంగా పెరిగింది. అయితే దక్షిణాది రాష్ట్రాల వృద్ధిలో మాత్రం నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఏప్రిల్ నుంచి అగస్ట్ వరకు ఐదు నెలల్లో జిఎస్‌‌టి వసూళ్లు 18 శాతం పెరిగినట్టు వాణిజ్య పన్నులశాఖ వెల్లడించింది. అయితే ఈ వృద్ధిలో ఐదు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉండడం విశేషం. ఈ కాలంలో రు. 25,449.80 కోట్లు జిఎస్‌‌టి రూపంలో రాగా, గత ఏడాది ఇదే కాలంలో రూ.21,558.09 కోట్లు వచ్చింది. గతేడాదితో పోలిస్తే 18.05% వృద్ధిగా లెక్క తేల్చారు. ఇక ఒక్క ఆగస్టు నెలలోనే అన్ని పన్నుల ద్వారా 983.84 కోట్ల రూపాయలు వచ్చినట్లు గుర్తించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక జిఎస్‌‌టి వసూళ్లో 23 శాతంతో మొదటి స్థానంలో ఉంది. కేరళ 21 శాతం, తెలంగాణ 19 శాతం వృద్ధితో ముందున్నాయి. 16 శాతంతో తమిళనాడు మన తరువాత స్థానంలో ఉంది.

పెట్రోలియం వ్యాట్ పైనే

ఈసారి కూడా పెట్రో ఉత్పత్తులపైనే రాష్ట్ర ఖజానా ఆధారపడింది. ఆగస్టులో పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ ద్వారా రు. 1,681.55 కోట్లు రాగా, గత ఏడాది ఆగస్టులో రూ. 1,389 కోట్లు వచ్చాయి. దీంతో 21.03 శాతం వృద్ధి నమోదైనట్టు తేలింది. ఐదు నెలల కాలంలో ఈ ఆదాయం రూ. 6,868 కోట్ల నుంచి రూ. 8,281 కోట్లకు 20.58 శాతంతో వృద్ధి సాధించింది. ఆగస్టులో వృత్తి పన్ను ద్వారా రూ. 45.20 కోట్లు రాగా గతేడాది రు 42 కోట్లతో పోలిస్తే 7.68% పెరిగింది. ఏప్రిల్‌, ఆగస్టు మధ్య ఈ ఆదాయం రు222 కోట్ల నుంచి రు. 240 కోట్లకు చేరి 7.91 శాతం వృద్ధి నమోదు చేసింది.

మద్యంపై వ్యాట్‌ వృద్ధి స్వల్పమే

మద్యంపై వ్యాట్‌‌లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఐదు నెలల్లో రు. 411 కోట్ల నుంచి రు. 443 కోట్లకు చేరి 7.7 శాతమే వృద్ధి నమోదైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆగస్టులో రు. 1,979.74 కోట్ల ఐజిఎస్‌‌టి సెటిల్‌మెంట్ ద్వారా రాగా గత ఏడాది ఆగస్టులో వచ్చిన రూ. 1,612.98 కోట్లతో పోలిస్తే ఇది 366.76 కోట్లు అధికం.ఇక ఆగస్టులో వచ్చిన ఆదాయంలో ఆటోమొబైల్స్‌ రంగం, విడి పరికరాలు, ప్లాస్టిక్స్‌, యంత్రాలు, ఉపకరణాలు వంటి రంగాల్లో వృద్ధి కొంతవరకు అధికంగా నమోదైందని వాణిజ్యపన్నుల శాఖ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్