మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజీ సుభాష్ చంద్ర ప్లాన్‌కు ఎన్‌‌సిఎల్‌‌టి బ్రేక్

53 నిమిషాల క్రితం

Essel Group Chairman Subhash Chandra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్టే

న్యూఢిల్లీ : జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా వ్యవహారంలో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌‌సిఎల్‌‌టి) బెంచ్‌ ఆయనకు షాక్‌ ఇచ్చింది. రూ.22,006.57 కోట్ల అప్పులకు గాను రూ.6.25 కోట్ల చెల్లింపు పరిష్కారం ప్లాన్‌‌ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం నిలిపివేసింది. ఈ కేసు మళ్లీ విచారించనున్నట్లు పేర్కొంటూ... అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఈ చెల్లింపు ప్రణాళికను తొలుత విచారించిన జ్యుడీషియల్ మెంబర్ అశోక్ కుమార్ భరద్వాజ్, టెక్నికల్ మెంబర్ రీనా సిన్హా పురిలతో కూడిన ఎన్‌సిఎల్‌‌టి బెంచ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ప్రణాళికకు మద్దతు తెలిపిన రుణదాతలకే దీనిని వర్తింపజేయాలని, వ్యతిరేకించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ బకాయిల వసూలుకు వేర్వేరుగా చర్యలు తీసుకోవచ్చని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. తీవ్రమైన లోపాలున్నాయని పేర్కొంటూ పురి ఇంతక్రితం ప్రణాళికను తిరస్కచారు. గత ఉత్తర్వుల్లో స్పష్టమైన మెజారిటీ అభిప్రా యం లేదని పేర్కొంటూ ఆగస్టు 25 నాటి నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిలిపి వేసింది. కేసు విచారణ కొనసాగుతున్నంత కాలం సుభాష్ చంద్ర ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆస్తులను బదిలీ చేయకుండా ఆంక్షలు విధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్