mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

2 గంటల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 07:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో య్రాతికుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో కూడా భక్తులు భారీగా వేచి ఉన్నారు. టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. యాత్రికులకు ఇబ్బంది కలగకుండా టిటిడి నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఇక నిన్న (శుక్రవారం) స్వామివారిని మొత్తం 81,340 మంది దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు గాను 44,874 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే కానుకల రూపంలో సమర్పించిన శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్