mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ కేసు సిట్‌ విచారణ వేగవంతం.. పరారీలో ఉన్న పోలీసుల కోసం గాలింపు

1 గంట క్రితం

sai krishna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ: నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ మిస్టరీ కేసులో ప్రత్యేక విచారణ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారులు.. విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం పరారీలో ఉన్న పోలీసుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు సెంట్రల్ డివిజన్ టాస్క్‌ఫోర్స్ నుంచి రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పలు కోణాల్లో గాలిస్తున్నాయి. పరారీలో ఉన్న సదరు పోలీసు అధికారులు పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు వచ్చిన నమ్మకమైన సమాచారంతో సిట్ అలర్ట్ అయింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తక్షణమే హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థానిక పోలీసుల సహాయంతో అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్