అమెరికా మధ్యవర్తిత్వంతో చారిత్రాత్మక ముందడుగు
వాషింగ్టన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య చారిత్రాత్మక ‘త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్’ కుదిరింది. అమెరికా యంత్రాంగం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇజ్రాయెల్ రాయబారి యెచియేల్ లీటర్, లెబనాన్ రాయబారి నాడా హమదేహ్, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ హోలర్‌లు ఈ అగ్రిమెంట్‌పై అధికారికంగా సంతకాలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యానికి, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌నకు మధ్య కొన్ని నెలలుగా సాగుతున్న భీకర పోరాటానికి ముగింపు పలికి, భవిష్యత్తులో మరింత విస్తృతమైన శాంతి ఒప్పందం కుదిరేందుకు ఈ పరిణామం ఒక బలమైన ముందడుగు అని నేతలు అభివర్ణించారు.









కామెంట్‌లు (0)