mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకిస్థాన్‌ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 5.4 తీవ్రత నమోదు

2 గంటల క్రితం

earth quke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లాహోర్‌:పాకిస్థాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా నమోదైనట్లు భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూరోపియన్‌ మెడిటేరియన్‌ సీస్మలాజికల్‌ సెంటర్‌ (EMSC) తెలిపిన వివరాల ప్రకారం.. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల ధాటికి ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భవనాల నుంచి బహిరంగ ప్రదేశాల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్