సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి

1 గంట క్రితం

gdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. విపరీతంగా పెరిగిన ధరల కారణంగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తి, పొదుపు, ఆదాయాలు క్రమంగా తరిగిపోతున్నప్పటికీ భారత జిడిపి 7.8 శాతం వృద్ధి సాధించిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించడం గమనార్హం. సాధారణ ప్రజల చేతిలో నగదు ప్రవాహం తగ్గి, మార్కెట్లో వినియోగ డిమాండ్ మందగించిన పరిస్థితుల్లో ఈ ప్రకటన విడుదలైంది. అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి మధ్య ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ ‌నుంచి జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో దేశ జిడిపి 7.8 శాతంగా నమోదైంది. అంతకుముందు మార్చి త్రైమాసికంలో నమోదైన 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి వేగం తగ్గినప్పటికీ.. ఆర్‌‌బిఐ, ఇతర అంతర్జాతీయ ఏజెన్సీల అంచనాల కంటే ఎక్కువగా నమోదైనట్లు ప్రకటించడం విశేషం. క్యూ1లో జిడిపి 7 శాతంగా ఉండొచ్చని ఆర్‌‌బిఐ ఇటీవల అంచనా వేసింది. 2025-26 ఇదే తొలి త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధి చోటు చేసుకుంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ రిపోర్ట్‌ ‌ప్రకారం.. 2026-27 తొలి త్రైమాసికంలో స్థిర ధరల వద్ద రియల్ జిడిపి రూ. 81.36 లక్ష కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 75.46 లక్ష కోట్లుగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద నామినల్ జిడిపి 10.3 శాతం వృద్ధితో రూ. 88.27 లక్ష కోట్లకు చేరినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో రూ.80 లక్షల కోట్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా కొనసాగడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని ప్రభుత్వం పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్