ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పచ్చని అరటి తోటపై కత్తిపోటు!

2 గంటల క్రితం

arati torha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 500 నుంచి 700 అరటి చెట్లు నరికివేత!

ప్రజాశక్తి-బ్రహ్మంగారిమఠం(కడప) : మండలం లింగాలదిన్నెపల్లి గ్రామంలో దారుణం జరిగింది. లెక్కల బాలిరెడ్డి అనే రైతుకు చెందిన పొలంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాదాపు 500 నుండి 700 అరటి చెట్లను నరికివేశారు. ఉదయాన్నే తోటకు వెళ్లిన రైతు, ధ్వంసమైన పంటను చూసి గుండెపగిలేలా రోదించారు. రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టానని, మూడు నెలల వయసున్న చెట్లను నరికేసి తను నట్టేట ముంచారని ఆవేదన చెందారు. గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగినా పోలీసులు పట్టించుకోలేదని రైతు ఆరోపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్