ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అడుగులు ఆరోగ్యానికి... అవగాహన గుండెకు రక్షణ

1 గంట క్రితం

heart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గుండె జబ్బుల నివారణపై వాకర్స్‌కు వైద్య నిపుణుల అవగాహన

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్: పుత్తూరు వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుండె జబ్బుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.ఎల్‌. మూర్తి, వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రవిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తిరుపతి అమర హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ... గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, క్రమం తప్పకుండా నడక, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. నిత్యం నడకను జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యఅతిథిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు గుణశేఖర్ రెడ్డి, రఫీ అహ్మద్, కేకేసి కళాశాల చైర్మన్ కుప్పయ్య శెట్టి, వైస్ చైర్మన్ నరసింహారావు, రామ్మోహన్ వర్మ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్