శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంగం వాగు సమీపంలో సంచరిస్తున్న పెద్దపులి

20 నిమిషాల క్రితం

పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

ప్రజాశక్తి – ఏలూరు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బొత్తప్పగూడెం సమీపంలోని సంగం వాగు పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. జిల్లెళ్లగూడెం గ్రామ సమీపంలో గతంలో ఎద్దుపై దాడి చేసిన పెద్దపులి, తిరిగి ఆ కళేబరం వద్దకు వచ్చి ఆహారం తీసుకున్నట్లు గుర్తించారు. అనంతరం సంగం వాగు పరిసరాల్లో సంచరించి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలిపారు.
పెద్దపులి కదలికల నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్