ప్రజాశక్తి – శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరానికి శనివారం ఉదయం ఓ బోటు కొట్టుకొచ్చింది. పాకల పల్లిపాలెం సమీపంలోని తీరానికి చేరే సమయానికి బోటు రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ బోటు ఏ ప్రాంతానికి చెందినదనే విషయంపై మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే బోటు మాత్రమే తీరానికి కొట్టుకురావడంతో అందులో వేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితిపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బోటులో ఎవరైనా ఉన్నారా? వారి పరిస్థితి ఏమిటనే విషయాలు తెలియాల్సి ఉంది.
పాకల సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన బోటు
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 07:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)