ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
ప్రజాశక్తి – న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరంలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 348 పాయింట్లుగా నమోదైంది. దీంతో ఢిల్లీ గాలి నాణ్యత 'వెరీ పూర్' కేటగిరీలోకి చేరింది. మొత్తం 48 పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 300 పాయింట్లు దాటగా, నరేలా సమీపంలోని NIH కేంద్రం వద్ద అత్యధికంగా 429 పాయింట్లు నమోదయ్యాయి.
పెరుగుతున్న కాలుష్యంతో ప్రజలు కళ్ల మంటలు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో GRAP-1, 2, 3 ఆంక్షలను అమలు చేస్తున్నారు. బొగ్గు, కట్టెల వినియోగంతో పాటు డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. ప్రజా రవాణాలో CNG, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నారు.
అలాగే ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. అత్యవసరం కాని నిర్మాణ పనులపై నిషేధం కొనసాగిస్తున్నారు.






కామెంట్‌లు (0)