శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మిసిసిపీ నదిలో క్రూయిజ్‌ నౌకను ఢీకొన్న ట్యాంకర్‌

14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 180 మందితో ఉన్న నౌక బోల్తా.. అందరూ సురక్షితం

అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌ వద్ద మిసిసిపీ నదిలో శుక్రవారం భారీ నౌకా ప్రమాదం జరిగింది. నది ఒడ్డున నిలిపి ఉంచిన క్రూయిజ్‌ నౌకను అట్లాంటిక్‌ ఆస్ఫాల్ట్‌ అనే ట్యాంకర్‌ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో క్రూయిజ్‌ నౌకలో సుమారు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఢీకొన్న ధాటికి నౌక నీటిలోకి ఒరిగి బోల్తాపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది, సమీపంలోని నౌకల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిపోయిన వారిని రక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడినట్లు న్యూ ఓర్లీన్స్‌ మేయర్‌ హెలెనా మోరెనో తెలిపారు. ఈ ప్రమాదంలో 32 మందిని ఆసుపత్రులకు తరలించగా, ఎవరికీ ప్రాణాపాయ గాయాలు కాలేదని వెల్లడించారు.

ట్యాంకర్‌ స్టీరింగ్‌ సమస్య కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని కోస్ట్‌గార్డ్‌ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని నిర్ధారించేందుకు జాతీయ రవాణా భద్రతా మండలి దర్యాప్తు చేపట్టనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్